నిస్వార్థ కమ్యూనిస్టు ఏబీ బర్ధన్


కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేత ఏపీ బర్దన్... 
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్.

ఏలూరు జిల్లా. ఏలూరు: భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు కార్మిక నేత, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి కార్యక్రమం జరిగినది.

వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సాధిస్తాం ఏబీ బర్ధన్ ఆశయాలను,జోహార్ ఏబీ బర్ధన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఏబీ బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. బర్ధన్ తన రాజకీయ ప్రస్థానాన్ని నాగపూర్ నుంచి ప్రారంభించారని, ఆ ప్రాంత విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బర్ధన్ చేసిన పోరాటాలను గుర్తించిన ప్రజలు ఆయన్ను శాసనసభ్యులుగా గెలిపించారని తెలిపారు.ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా కార్మిక సమస్యల పైన అనేక పోరాటాలు చేసి, కార్మిక చట్టాలు రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్రను బర్ధన్ పోషించారని కొనియాడారు.

ఆర్ఎస్ఎస్ భారతదేశ విభజనకు, దేశ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించడానికి పనిచేస్తుందని గుర్తించిన బర్ధన్ ఆనాడే ఈ మతోన్మాద శక్తుల స్వరూపాన్ని తెలియజేస్తూ అనేక రచనలు చేసిన గొప్ప రచయిత బర్ధన్ అని కొనియాడారు. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించడం ద్వారా ఏబీ బర్ధన్ వదిలి వెళ్ళిన ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు.

సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శులు కురెళ్ళ వరప్రసాద్,అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు పని చేసిన ఏపీ బర్దన్ కార్మిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను పోరాటాలను రూపకల్పన చేసిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు. ఆయన జీవితమంతా నిస్వార్థంగా, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, చేసిన పోరాటాలు ఎందరికో ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే భవిష్యత్తు ఉద్యమాలలో ఏబీ బర్ధన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పని చేయటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు.