ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం సూరపరాజు కాలనీలోని అగాపే స్వచ్ఛంద సేవాసంస్థ
కార్యాలయంలో అగాపే వ్యవస్థాపకుడు బిరుదుగడ్ల ఆశి బాబు వ్యక్తిగత వితరణతో బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం గ్రామానికి చెందిన మడి శ్రీను, శిరీష దంపతుల కుమారుడు మడి శ్రీనీత్ (7సం) కు వీల్ చైర్ అందజేశారు.
మంగళవారం సాయంత్రం జరిగిన అగాపే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో ఆశిబాబు మాట్లాడుతూ పులిరామన్నగూడెంకు చెందిన శ్రీనీత్ విభిన్న ప్రతిభావంతునిగా సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి సోకడం ద్వారా మారాడని, తల్లి శిరీష వీల్ చైర్ అవసరమని శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు బిరుదుగడ్ల నాగేశ్వరరావు దృష్టికి తమ సమస్య తీసుకురాగా వారి ద్వారా విషయం తెలుసుకుని వీల్ చైర్ ఈరోజు అందజేశామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న జీ కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ తోటి వైకల్యబాధితుల సేవలో ఆశిబాబు చూపుతున్న స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
కే ఎల్ ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ కష్టంలో సైతం సాటివారి పట్ల ఆదరణ చూపడం ఆశిబాబు వ్యక్తిత్వానికి నిదర్శనమని, తల్లి కాంతమ్మ ఇస్తున్న సహకారం, అండగా నిలిచిన కుటుంబం ఆశిబాబుకు తోడవడం మరింత శక్తిని ఆశిబాబుకు అందించిందని అన్నారు.
పాల్గొన్న శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎరిపే గంగాదేవి మాట్లాడుతూ శ్రీనీత్ పుట్టుకతో వైకల్యంతో లేకపోయినా పేదరికం వల్ల ఏర్పడ్డ పౌష్టికాహారం లోపం వైకల్యానికి గురయ్యేలా చేసిందన్న భావన వ్యక్తం చేస్తూ గర్భిణీలు పౌష్టికాహారం స్వీకరించడం బిడ్డకు జన్మనిచ్చాక సమగ్ర ఆహారమైన తల్లిపాలు సమృద్ధిగా అందిచడంతో పాటు సమయానికి తగిన వ్యాక్సిన్లు తప్పక వేయించడం ఎంతో అవసరమని అవగాహన తల్లితండ్రులు కలిగి ఉండాలని అన్నారు.
దాత ఆశిబాబుకు నాగేశ్వరరావు మరియు శ్రీనీత్ తల్లి శిరీష మరియు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు

Social Plugin